NTR: మళ్ళీ చారీ గా నటించాలనుందని మనసులో మాట బయట పెట్టిన తారక్..!

NTR : ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి అదుర్స్. ఇందులో ఎన్టీఆర్ నటన, కామెడీ టైమింగ్ ఎవరికైనా నచ్చుతాయి. బ్రహ్మానందం తో పోటీపడి హాస్యం పంచాడు ఎన్టీఆర్. ఈ సినిమా లో ద్విపాత్రభినయం చేసాడు. ఒకటి మాస్ క్యారెక్టర్ అయితే మరొకటి పూర్తి భిన్నమైన పాత్ర. అయిన దేనికదే అన్నట్టు నటించి మెప్పించాడు ఎన్టీఆర్.

ఎప్పటికప్పుడు అదుర్స్ సీక్వెల్ గురించి వార్తలు వస్తున్న సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. అటు నందమూరి అభిమానులే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడా ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అప్పుడే ‘అదుర్స్‌ 2’ సినిమా ప్రస్తావన వచ్చింది. మీ సినిమాల్లో ఓ సినిమాకి సీక్వెల్ ఉండాలి అనుకుంటే దేనికి చెయ్యాలి అనుకుంటున్నారని తారక్‌ను అడగ్గా అతను ఏ మాత్రం ఆలోచించకుండా ‘అదుర్స్’ పేరు చెప్పేశాడు. తన కెరీర్‌లో ఆ సినిమాకు మంచి స్థానం ఉంది. దాంతోపాటు తారక్‌లోని వైవిధ్యం మొత్తాన్ని ఆ సినిమా చూపించింది.

నిజానికి ఈ సినిమాకు సీక్వెల్‌ ఉండే అవకాశం ఉంది అంటూ ఆ సినిమా దర్శకుడు వీవీ వినాయక్‌ చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. కథ సిద్ధమైతే, తారక్‌తో ఆ సినిమా చేయడమే తన ఆలోచన అని కూడా చెప్పారు.అయితే ఏమైందో ఏమో. ‘అదుర్స్‌’ సీక్వెల్‌ ఆలోచన ఇటీవల కాలంలో వినిపించడం లేదు. తారక్‌ వరుస సినిమాలతో బిజీ అవ్వడం, వినాయక్‌ వేరే సినిమాలతో ఉండటం కారణంగా ‘అదుర్స్‌’ ముచ్చట్లే లేవు. మరిప్పుడు తారక్‌ మనసులో కూడా అదుర్స్‌ సీక్వెల్‌ మేటర్‌ ఉంది కాబట్టి. మళ్లీ వినాయక్‌ ఏమన్నా ఈ విషయం గురించి ఆలోచిస్తారేమో చూడాలి.