NTR: ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తున్నారు అనేది చర్చనీయ అంశాంగా మారింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మొదట ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో చిత్రం పట్టాలెక్కునున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వం లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా ఖరారు ఐనట్లు సమాచారం.
1980 నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని తెరపైకి తీసుకురాబోతున్నారు.ఐతే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఇంకా ఎన్టీఆర్ ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం.దీనికి కారణం..సినిమాలోని ఓ కీలక ఘట్టంలో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దివ్యాంగుడిగా కనిపించాలట. అది స్టోరీకి చాలా కీలకం. కానీ అలా కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది జూనియర్ ఎన్టీఆర్ అనుమానం.ఈ విషయంలో తారక్ పునరాలోచనలో పడ్డారని సమాచారం.అయితే డైరెక్టర్ మాత్రం ఆ పాయింట్ సినిమాకు చాలా కీలకం కావడంతో ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారట. మరి ఈ విషయంలో యంగ్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారు? .. ఎలా ముందుకు వెళతారన్నది ఇప్పడు చాలా ఆసక్తికరంగా మారింది.
కానీ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాని వదులుకోవడం ఇష్టం లేనట్టుగానే వుంది. మరి ఆర్ ఆర్ ఆర్ వంటి ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ పెద్ది లాంటి ప్రాజెక్ట్ చేయాలా వద్ద అన్న కన్ఫ్యూషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా వున్నారట. చూడాలి మరి ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో. కానీ ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా తర్వాత చేస్తోన్న సినిమా కాబట్టి ఈ సమయం లో సినిమా తన కెరీర్ కి ఎంతో కీలకమైనది. ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అభిమానులు ఆసక్తి గా గమనిస్తున్నారు.