మొత్తానికి అమెరికా వెళ్ళబోతున్న ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ అవార్డుల వేడుకలలో ఆర్ఆర్ఆర్ మరోసారి సత్తా చూపించి హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డులని సొంతం చేసుకుంది. ఇదిలా ఈ వేడుకకి తారకరత్న మరణంతో జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేకపోయాడు. అయితే రామ్ చరణ్ వెళ్ళడంతో హాలీవుడ్ మీడియా ఫోకస్ అంతా అతని మీదనే పడింది. ఇదిలా ఉంటే ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక వచ్చే నెల జరగబోతుంది.

ఈ నేపధ్యంలో ఈ వేడుకకి తారక్ వెళ్ళబోతున్నాడు. మార్చి 5న తారక్ ఈ అవార్డుల వేడుక కోసం అమెరికా బయలుదేరుతాడు. ఇక అక్కడే అకాడమి అవార్డుల వేడుక ముగిసే వరకు ఉంటాడు. ఈ లోపు పలు హాలీవుడ్ మీడియా హౌస్ లకి తారక్ ఇంటర్వ్యూలు ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్స్ లో తారక్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటాడని తెలుస్తుంది. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో రామ్ చరణ్, తారక్ మరల అమెరికాలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మార్చి 13న ఆస్కార్ అవార్డుల వేడుక జరగబోతుంది. ఇక ఈ అవార్డుల వేడుకకి హీరోలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అలాగే లెరిక్ రైటర్ చంద్రబోస్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. చంద్రబోస్ మార్చి 8న యూఎస్ లో అడుగుపెడతాడు. ఆస్కార్ ఫైనల్ నామినేషన్ కి వెళ్ళిన నాటునాటు సాంగ్ కి లైవ్ కన్సర్ట్ కూడా ఈ అకాడమి వేడుకలలో భాగంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

మొత్తానికి మన టాలీవుడ్ హీరోలు గ్లోబల్ స్టార్స్ గా మరోసారి యూఎస్ లో సందడి చేయబోతూ ఉండటం నిజంగా విశేషం అని చెప్పాలి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవరికి రాని గౌరవం, గుర్తింపు ఇప్పుడు తారక్, రామ్ చరణ్ కి రావడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి. ఇక ఈ అవార్డుల వేడుక ముగించుకొని వచ్చిన తర్వాత కొరటాల దర్శకత్వంలోనే సినిమాని తారక్ ప్రారంభిస్తాడని తెలుస్తుంది.