యువ సుధ బ్యానర్ అంటే, కొరటాల శివకి ఓన్ బ్యానర్ లెక్క. మొదట ఈ బ్యానర్‌లోనే పూర్తిగా ఎన్టీయార్ 30 నిర్మించాలనుకున్నారు. తర్వాత కళ్యాణ్ రామ్ జాయిన్ అయ్యాడు. అలా యువసుధ, ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఎన్టీయార్ కూడా జాయిన్ అయ్యాడనీ అంటున్నారు. అసలే ఈ సినిమా ఎన్టీయార్‌కి చాలా చాలా ప్రెస్జీజియస్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ నటిస్తున్న సినిమా.
మరోవైపు ‘ఆచార్య’తో కొరటాల శివ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కాన్ఫిడెన్స్ డల్ అయిపోయింది. సో, కొరటాలలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచేందుకే ఎంత బడ్జెట్ అయినా పర్లేదు కానీ, సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు.. మంచి అవుట్ పుట్ రావాలని కొరటాలను పుష్ చేస్తున్నాడట ఎన్టీయార్.
దాంతో, బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అయిపోయింది ఈ సినిమా. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనీ, ‘ఆర్ఆర్ఆర్‌కి మించిన రేంజ్‌లో ఈ సినిమా వుండాలని అంటున్నాడట. చూడాలి మరి, ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్‌ని ఈ సినిమా అందుకోగలదా.?