ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే అన్ని సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలని ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ఆచార్య. ఇటీవల విడుదలైన ఈ సినిమా తీవ్ర పరాజయం పొందిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ప్లాప్ అవటంతో చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ.. సినిమా డైరెక్టర్లకి పాఠాలు నేర్పించాడు. ఇండస్ట్రీలో డైరెక్టర్స్ సరిగా లేకపోతే ప్లాప్ లు వస్తాయని అందుకు మంచి ఉదాహరణ తను నటించిన ఆచార్య సినిమా అని చెప్పుకొచ్చాడు.
డైరెక్టర్ ఎప్పుడు అప్డేటెడ్ గా ఉండాలని, ఆవేశపడి డేట్స్ క్లాష్ అవుతాయని కంగారుతో షూటింగ్ చేయటం వల్ల సమస్యలు ఇలాంటి పరిస్థితి వస్తుందని చిరంజీవి వెల్లడించాడు. డైరెక్టర్స్ మీదే సినిమా ఇండస్ట్రీ ఆధారపడి ఉంటుందని, అందువల్ల వారు ఆ విషయం బాగా గుర్తుంచుకోవాలని చిరంజీవి ఇన్ డైరెక్ట్ గా కొరటాల శివని తప్పుపడుతూ మాట్లాడాడు. అయితే ఇటీవల బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలను కోరుకోవటం వల్ల గ్లోబల్ ఇండస్ట్రీ ఒత్తిడికి గురవుతోందని వెల్లడించారు. ఈ ఒత్తిడిని చాలెంజింగ్ గా తీసుకుంటేనే మంచి సినిమాలు వస్తాయని ఎన్టీఆర్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎవరో ఒక్కరినే నిందించటం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అయితే తాను ఎవరిని తక్కువ చేయటం లేదని, అందరూ దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మంచి సినిమాలను ప్రేక్షకులు అందించడానికి ముందుకు వెళ్దామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎన్టీఆర్ ఇలా వ్యాఖ్యలు చేశాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.