అబ్బో.. పవన్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్.!

Jr NTR

టాలీవుడ్ లో ఎప్పుడూ ఓ ఇంట్రెస్టింగ్ పరిస్థితి కనబడుతూనే ఉంటుంది. హీరోలు ఎప్పుడు కలిసే ఉంటారు కానీ వారి అభిమానులు మాత్రం కొట్టుకు చస్తుంటారు. అప్పుడప్పుడు కలిసేది అయినా క్షణం పాటు మాత్రమే కానీ గొడవలు మాత్రం ఎప్పుడూ అలానే ఉంటాయి. కాగా లేటెస్ట్ గా అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది.

ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ వేడుకల్లో లేడు యూఎస్ నుంచి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆహ్వానం రావడం తనకి పలు అవార్డులు దక్కడం వంటివి ఆసక్తిగా మారాయి. కాగా చరణ్ కి తనతో అక్కడికి వెళ్లిన ఆర్ ఆర్ ఆర్ టీం కి పవన్ లేటెస్ట్ గా శుభాకాంక్షలు తెలియజేసారు.

కానీ అందులో ఎక్కడా ఎన్టీఆర్ పేరుని మెన్షన్ చేయకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎందుకో పెద్దగా నచ్చలేదు. దీనితో సోషల్ మీడియా వేదికగా పవన్ పై విరుచుకుపడుతున్నారు. పవన్ కి ఇంత ఈగో ఏంటో అని అందరినీ మెన్షన్ చేసి ఎన్టీఆర్ పేరు చెప్పకపోవడం ఏంటని ఈ రోజు ను నెక్స్ట్ ఎలక్షన్స్ లో చూపిస్తాం అంటూ ఏవేవో వార్నింగ్ లు ఇస్తున్నారు.

దీనితో పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. దానికి చురకలు అంటిస్తున్నారు. పవన్ అక్కడ ఉన్న వారిని మాత్రమే ఉద్దేశించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసారని అలా అయితే లాస్ట్ టైం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు అందుకున్నప్పుడు చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ పేరు కూడా పెట్టారు..

ఆ ఆసమయంలో చరణ్ పవన్ కి థాంక్స్ చెప్పాడు కానీ ఎన్టీఆర్ ఎలాంటి స్పందన చూపించలేదు మరి దాన్నేం అనాలని అంటున్నారు. మరికొందరు అయితే మీరు నిజంగానే పవన్ ని ఏదో ఓట్ లు వేసేసినట్టు మాట్లాడుతున్నారే అంటూ సెటైర్స్ కూడా వేసుకుంటున్నారు.