NTR : ఎన్టీఆర్ అభిమానులకే ఎందుకో ఇన్ని కష్టాలు..?

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను మాన్ అఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటారు. ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డు లను తిరిగి రాస్తోంది. ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ హిట్ రావడం తో అభిమానులు ఆనందం లో వున్నారు కానీ, సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉండటం తో కాస్త నిరాశ చెందారు.అంతే కాకుండా ఎన్టీఆర్ కి సంబందించిన సీన్ కత్తెర కు గురికావడం వంటివి ఫాన్స్ బాధపడటానికి కారణాలు అయ్యాయి. అయితే సినిమా సాధించిన ఘన విజయం, ఇంకా సినిమా విడుదల అయినప్పటి నుండి ఎన్టీఆర్ నటనకు వస్తున్న అభినందనల ముందు ఏవేవి గుర్తురావటం లేదు.

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న సినిమా ఇప్పటికి మొదలు కాకపోవడం ఫాన్స్ ను అసంతృప్తి కి గురి చేస్తోంది.ఇక ఈ సినిమా జూన్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. అయితే మరికొన్ని రోజుల్లో అలియా భట్ పెళ్లి జరగనున్న నేపథ్యంలో అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకోవచ్చని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఆమె తప్పుకునే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి వుంది.

మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అప్ డేట్స్ విషయంలో తారక్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఎన్టీఆర్ మినహా మరెవరూ ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ ఈ సినిమా గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. 2023 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.ఇక ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను ఎప్పుడు మొదలుపెడతారో ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.