‘జూనియర్ ఎన్టీయార్ సినిమాల్ని బ్యాన్ చేయండి..’ అంటూ గతంలో చాలా సార్లు, టీడీపీ గ్రూపుల్లోనూ, నందమూరి అభిమానుల గ్రూపుల్లోనూ మెసేజ్‌లు షేర్ అయ్యాయి. సోషల్ మీడియాలో స్పేసులు పెట్టి మరీ, నానా యాగీ చేశారు.. వీళ్ళంతా టీడీపీలో ఓ వర్గానికి చెందినవారని చెప్పొచ్చు.
దానికి రివెంజ్ తీర్చుకోవడమెలా.? అని ఆలోచిస్తున్న జూనియర్ ఎన్టీయార్ అభిమానులు, ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాలపై గుస్సా అవుతూ, ‘భగవంత్ కేసరి’ సినిమా మీద కన్నెర్ర జేస్తున్నారట.
‘భగవంత్ కేసరి’ సినిమా చూడొద్దంటూ ఇప్పటికే కొందరు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారానికి సంబంధించి జూనియర్ ఎన్టీయార్ స్పందించకపోవడాన్ని తప్పు పడుతూ, ‘ఐ డోన్ట్ కేర్ బ్రో..’ అంటూ బాలయ్య లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ‘భగవంత్ కేసరి’ సినిమానీ ‘వియ్ డోంట్ కేర్ బ్రో..’ అంటున్నారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు. ఇంత జరుగుతున్నా, జూనియర్ ఎన్టీయార్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగకపోవడమే ఆశ్చర్యకరం.
అంటే, బాలయ్యతో కోల్డ్ వార్‌కి జూనియర్ ఎన్టీయార్ ‘సై’ అనేసినట్టేనేమో.!