NTR: అభిమానుల ప్రేమ కు హద్దు లేదని నిరూపించిన ఈ హీరో ఫ్యాన్స్ ఏం చేసారో తెలిస్తే షాక్!

NTR : తెలుగు చిత్ర సీమలోకి నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎపుడో నిరూపించుకున్నాడు.సినిమా కుటుంబంతో వచ్చిన తాను సొంతంగా ఎదిగాడు. చిన్న వయసులోనే బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్స్ ను అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఎన్టీఆర్ కి ఉన్న అభిమానుల గురించి చెప్పక్కర్లేదు ఫ్యాన్స్ ఆయన్ను మాన్ అఫ్ మాస్ఎస్ గా పిలుచుకుంటారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక విదేశాల్లోను హిందీ డబ్బింగ్ సినిమాలా కారణంగా ఉత్తరాదిన అభిమానులను సంపాదించాడు ఈ నందమూరి చిన్నోడు. నటన, తన డాన్సు, డైలాగ్ డిక్షన్ తో అభిమానులనే కాదు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు ఎన్టీఆర్. ఇక రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించాడు. ఇక విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా వస్తోంది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ మొదలయింది అప్పుడే.

మొన్నామధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక థియేటర్స్ మొత్తం టికెట్స్ కొనేసి కెనడాలో ఆశ్చర్య పరిస్తే, కొద్దిరోజులకే మరో చోట కార్స్ తో ఎన్టీఆర్ అని ఆర్ఆర్ఆర్ అని ఆంగ్ల అక్షరాలలో అర్థం వచ్చేలా రాసారు. ఇక ఇపుడు ఏకంగా విమానం నుండి ఎన్టీఆర్ పాత్ర కొమరం భీమ్ చెప్పే ‘తొక్కుకుంటూ పోవాలే ‘ డైలాగు ను ఆకాశంలో వదిలి సందడి చేసారు.ఇప్పుడు ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మన స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలోనూ భారీ స్థాయిలో అభిమానులు… అభిమాన సంఘాలూ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో నటించిన ఏ కొత్త సినిమా విడుదలవుతున్న కనీసం 20 రోజుల ముందు నుంచే ఇలా హడావిడి చేయడం అలవాటుగా మారింది.