NTR: ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో హైపర్ ఎనర్జీతో దూసుకుపోతున్న ఎన్టీఆర్

NTR : ఆర్ఆర్ఆర్ విడుదలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వబోతోంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడడంతో ప్రచార కార్యక్రమాలు మళ్ళీ మొదలెట్టారు చిత్ర బృందం. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లోను ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు.

ప్రొమోషన్స్ కోసం గుజరాత్, కలకత్తా,ముంబై, బెంగళూరు ఇలా మొత్తం ఇండియా చుట్టేస్తూ ప్రొమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు. ఇక ఈ ప్రొమోషన్స్ లో భాగంగా మీడియా ఇంట్రాక్షన్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ సూపర్ ఆక్టివ్ గా సమాధానాలు చెప్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు ఈ విషయం. లో ఫ్యాన్స్ ఫుల్ కుదిరితే అవుతున్నారు. అన్ని భాషలలోనూ మాట్లాడుతూ అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ప్రతి ఇంటర్వ్యూ లో తనదైన టైమింగ్ తో, మాటలతో అందరిని తనవైపు ఆకట్టుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈ విషయంలో రామ్ చరణ్ కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన తన మాటలు, అల్లరి తో ఆకట్టుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ విషయం లో ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. కానీ చరణ్ అభిమానులు మాత్రం మా హీరో కూడా కొంచెం సరదాగా ఇంటర్వ్యూ లో మాట్లాడితే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.ఇక ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇద్దరు హీరోల అభిమానులు హడావిడి మొదలుపెట్టేసారు.