శరవేగంగా ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రం!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’ ఈ సినిమాలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌తో పాటు గ్లింప్స్‌ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ‘దేవర’ టీమ్‌ కొత్త ఫొటోను పంచుకుంది.