NTR: కొత్త రికార్డు క్రియేట్ చేసిన తారక్..!

NTR: నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఎంత ఎత్తుకు వెళ్లిన ఒదిగి ఉన్నాడు ఎన్టీఆర్. తన నటనతో డాన్సులతో అందరిని అకట్టుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తన నటన ప్రతిభతో సీనియర్ నటులతో పోటీపడుతూ అభిమానులను సంతోషపెడుతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ప్రస్తుత యంగ్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

తాజాగా విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ఇంతటి ఘన విజయం తో ముందుకు వెళుతోందో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఘనవిజయం సాధించడంతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.గతంలో స్టార్ హీరోలు వరుస హిట్లు సాధించిన రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ జనరేషన్ హీరోలలో వరుసగా సినిమా మీద సినిమా హిట్ సాధించడం అంటే కాస్త కష్టమే. కానీ ఎన్టీఆర్ వరుసగా రెండు సార్లు హ్యాట్రిక్ కొట్టి డబల్ హ్యాట్రిక్ తో సరికొత్త రికార్డు సాధించాడు.

టెంపర్ సినిమాతో మొదలు కుని ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు.టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వరుసగా ఆరు హిట్స్ అందుకుని డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు..ఈయన రికార్డ్ విన్న ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు..