టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఎక్కువగా ఫిట్ నెస్ విషయంలో కేర్ తీసుకునే వారి జాబితాలో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. రాఖీ సినిమా వరకు తారక్ ఎక్కువగా ఫిట్ నెస్ మీద ఫోకస్ చేసే వాడు కాదు. ఆ సినిమా సమయంలో తనపై బాడీ షేమింగ్ విమర్శలు రావడంతో ఒక్కసారిగా తనని తాను మార్చుకొని కంప్లీట్ గా బరువు తగ్గిపోయారు.
కంత్రి సినిమాలో తారక్ ని చేసేసరికి అందరూ షాక్ అయ్యారు. అతనిలో ఊహించని బాడీ ఫార్మేషన్ చూసి నందమూరి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ సినిమాలో లుక్ పరంగా కొంత వీక్ గా కనిపించిన మరల రికవరీ అయ్యి బాడీ షేప్స్ మార్చుకున్నారు. అలాగే లుక్ పరంగా కూడా బెటర్ అయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో కండలు తిరిగిన దేహంతో జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన సంగతి తెలిసిందే.
అందులో కొమరాం భీమ్ పాత్ర కోసం హెవీగా వర్క్ అవుట్స్ చేసి బాడీ బిల్డర్ గా మారిపోయారు. ఈ సినిమా తర్వాత మరల కొరటాల శివ సినిమా కోసం ఏడాది పాటు తారక్ ఖాళీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే కొరటాల శివ సినిమాకి ముందు తారక్ లుక్ పరంగా కాస్తా తేడా ఉండేది.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లోగాని, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లోగాని చాలా లావుగా కనిపించారు. అయితే కొరటాల శివ సినిమా కోసం ఇలా లావుగా మారుతున్నాడని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అవుతోంది. తాజాగా ఫ్యాన్ తో తారక్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలలో మరల జూనియర్ ఎన్టీఆర్ లుక్ మారడంతో కాస్తా స్లిమ్ అయినట్లు కూడా కనిపిస్తున్నారు. దీంతో కొరటాల సినిమాలో తారక్ ఎలాంటి రూపంలో కనిపిస్తాడనే విషయంలో ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా బరువు తగ్గిపోయి, గడ్డం తీసేసి స్టైలిష్ లుక్ లో తారక్ కనిపించడం ఫ్యాన్స్ కి కూడా ఆసక్తికరంగా అనిపించింది.