ఎన్టీయార్, రామ్ చరణ్.. ఇంకోస్సారి.!

rrr-jr-ntr-ram-charan (2)

గ్లోబల్ స్టార్స్‌గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్నారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్.. అదీ, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో. ఇద్దరి మధ్యా పూర్తి క్లారిటీ వుంది. ఇద్దరి మధ్యా మంచి స్నేహం వుంది. కానీ, ఇరువురి అభిమానుల మధ్య తుడిచి పెట్టేయలేని పెంట పేరుకుపోతోంది.

అసలు ఈ ఇద్దర్నీ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎలా కలిపాడన్నది ఇప్పటికీ ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్. ‘అన్న, తమ్ముడు..’ అని ఇద్దరూ తమ మధ్య స్నేహం గురించి చెప్పుకుంటుంటారు. అభిమానులు మాత్రం, ఆ స్నేహాన్ని ఫీల్ అవలేకపోతున్నారు.

కుల జాడ్యం అనండీ, ఇంకోటనండీ.. కారణం ఏదైనా, జూనియర్ ఎన్టీయార్ – రామ్ చరణ్ అభిమానుల మధ్య పెంట పెంట జరుగుతూనే వుంది. ఇంతలోనే, ఇంకో ఇంట్రెస్టింగ్ గాసిప్ తెరపైకొచ్చింది.

రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందిట. వస్తే, అది పాన్ ఇండియా సినిమానే అవుతుందనుకోండి.. అది వేరే సంగతి. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఓ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నిస్తోంది.

ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతోపాటు, హాలీవుడ్ నిర్మాణ సంస్థతోనూ సంప్రదింపులు జరుపుతోందిట సదరు టాలీవుడ్ నిర్మాణ సంస్థ. దర్శకుడు ఎవరు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రాజమౌళి అవుతాడా.? అంటే, అయ్యేందుకు అవకాశాలూ లేకపోలేదు.

కానీ, ఓ యంగ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కోసం గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నాడట. కథ ఓ కొలిక్కి వచ్చిందనీ, ఆ కథ నచ్చే ఆ నిర్మాణ సంస్థ, చరణ్ – ఎన్టీయార్‌తో సినిమాకి సిద్దమవుతోందనీ అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ప్రాజెక్ట్ గనుక ఫైనల్ అయితే, ఇది నిజంగానే మరో సంచలనం అవుతుంది.