ఎన్టీయార్ – బాలయ్య మల్టీ స్టారర్ కోసం ప్రయత్నాలు.!

ఈ మధ్య మల్టీ స్టారర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’తో ఈ ట్రెండ్ సరికొత్త సంచలనాలకు వేదికైంది. దాంతో, స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ ప్లాన్స్ చేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్లతో పాటూ, కొత్తగా వస్తున్న డైరెక్టర్లు కూడా మల్టీ స్టారర్ కథలతో మ్యాజిక్ చేయాలనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలయ్య – ఎన్టీయార్ కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనుందన్న గాసిప్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. టీడీపీకీ అత్యంత సన్నిహితంగా వుండే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ సెట్ చేయాలని ప్రయత్నిస్తోందట. అయితే, ఎన్టీయార్ వైపు నుంచి అంత సానుకూలత కనిపించడం లేదనీ తెలుస్తోంది. ఎన్టీయార్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు.

అలాగే, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా, మరికొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు కమిట్ అయ్యి వున్నాడు. వీటిని సాకుగా చూపించి ఎన్టీయార్ బాలయ్యతో మల్టీ స్టారర్‌కి నో చెప్పేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఎలాగైనా ఎన్టీయార్‌ని ఒప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!