మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మార్చి 27వ తేదీ అంటే నిన్న చెర్రీ బర్త్ డే సందర్భంగా గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా హాజరయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్, అడవి శేష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనగా.. కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి వచ్చింది.
అలాగే ఇటీవలే ఓ ఇంటివాడైన మంచు మనోజ్ తన భార్య భూమా మోనికతో కలిసి చెర్రీ పుట్టిన రోజు సంబురాల్లో సందడి చేశారు. ఇలా చెర్రీకి దగ్గరైన స్నేహితులతో పాటు సినీ ప్రముఖులు అందరూ వచ్చినప్పటికీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించకపోవడం గమనార్హం. సినీ ఇండస్ట్రీలో తారక్ తో మొదటి నుంచే చరణ్ కు మంచి అనుబంధం ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ అనుబంధం మరింత ఎక్కువైంది. ఇద్దరూ సొంత అన్నాతమ్ముళ్లలా కలిసిపోయారు. వీరిద్దరి మధ్య బంధం ఎలా ఉందో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో అందరూ చూశారు. అయితే అంత క్లోజ్ గా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించకపోవడంతో అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎందుకు ఎన్టీఆర్ చెర్రీ బర్త్ డేకు రాలేడా అని ప్రశ్నిస్తున్నారు. అయితే షూటింగ్ వల్లే తారక్ పుట్టిన రోజుకు రాలేడని తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ రాత్రి వేళ ఉండడంతో తారక్ రాలేకపోయాడట. మరోవైపు చెర్రీకి స్వయానా బావ అయిన అల్లు అర్జున్ ఈ పార్టీకీ రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. మెగా, అల్లు ఫ్యామిలీ అంటే ఒక్క కుటుంబంలా చూస్తారు ఫ్యాన్స్.
సొంత కజిన్ అయిన బన్నీ చరణ్ బర్త్ డే పార్టీలో లేకపోవడం ఏంటని మెగా, అల్లు అభిమానులు అంతా ఆలోచనలో పడ్డారు. అయితే పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. కానీ బన్నీ మాత్రం ఈ వేడుకలకు హాజరు కాలేదు. సినిమా షూటింగ్ ఉండి రాలేడనుకుందాం అనుకున్నా అది కాదని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ ఈ పార్టీకి ఎందుకు రాలేదో ఆయనే చెప్తే గానీ తెలీదు.