అల్లు అరవింద్ తన సొంత నిర్మాణంలో బన్నీ, చెర్రీలపై ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ రూపొందించాలన్నది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే, పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో బన్నీ – చెర్రీ మల్టీ స్టారర్ కాస్తా, బన్నీ – ఎన్టీయార్ మల్టీ స్టారర్‌గా రూపం మార్చుకుంది. అల్లు అర్జున్ కూడా ఎన్టీయార్‌తో సినిమా చేసేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఎన్టీయార్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై సానుకూల స్పందనతోనే వున్నాడనీ తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు లేకపోయినప్పటికీ, సమీప భవిష్యత్తులో ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వర్కవుట్ కానుందనీ ప్రచారం జరుగుతోంది.
అటు ఎన్టీయార్ కానీ, ఇటు అల్లు అర్జున్ కానీ, కథల ఎంపికలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారట ఈ భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌కి సంబంధించి. చూడాలి మరి, ఎలాంటి కథ సెట్ అవుతుందో.! ఎప్పటికి ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందో.!