ఎన్టీయార్ క్- అల్లు అర్జున్ కృష్టార్జునులట.!

రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కించాలని వుందని చాలా కాలంగా అల్లు అరవింద్ చెబుతున్న మాటే. ఈ కాంబినేషన్‌కి సంబంధించి ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాననీ ప్రతీ ఏడాదీ ఆ టైటిల్‌ని రెన్యువల్ చేయిస్తున్నాననీ ఆయన గతంలో తెలిపారు. ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ చేయాలన్నదే తన డ్రీమ్ అని కూడా ఆయన తెలిపారు. అయితే, తాజాగా జరుగుతోన్న ప్రచారం మరోలా వుంది.

అల్లు అరవింద్ రిజిస్టర్ చేయించిన టైటిల్ ప్రాజెక్ట్‌లోకి రామ్ చరణ్ కాదు, ఎన్టీయార్ వచ్చి చేరాడనీ గుసగుస వినిపిస్తోంది. ‘కృష్ణార్జున’ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా వుందనీ అంటున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా ఎన్టీయార్, అల్లు అర్జున్ మధ్య బావా.. బావా.. అంటూ సోషల్ మీడియాలో డిస్కర్షన్ హంగామా నడిచిన సంగతి తెలిసిందే.

సందట్లో సడేమియా.. ఇదే అదనుగా ఈ సర్‌ప్రైజింగ్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లే జరిగి, ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే, అదో సెన్సేషనలే అవుతుంది. ఏది ఏమైతేనేం.. ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్ అయినా, ఈ గాసిప్ మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ అయ్యింది.