NTR : తాతకు తగ్గ మనవడిగా తారక్ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే నిరూపించుకున్నాడు. ఇక తన నటనా, డాన్సులు ఊరికే రాలేదు అందులో తన కఠోర శ్రమ దాగివుంది. తన తల్లి తపన దాగి ఉంది. తారక్ నందమూరి వారసుడిగా సినిపరిశ్రమలోకి వచ్చిన తాను స్వతహాగా కష్టపడి పైకి వచ్చాడని అందరు చెప్తారు.తనకంటూ తన కుటుంబం లో గుర్తింపు రావాలని తన తల్లి పడిన తపనను ఎన్టీఆర్ నెరవేర్చాడు. తన తల్లి ప్రోత్సాహంతోనే కూచిపూడి నృత్యం నేర్చుకున్నానని చెప్పే తారక్ ఇటీవల గల్ఫ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇంకో ఆసక్తికర విషయం చెప్పారు.
తారక్ ఒక కూచిపూడి డాన్సరే కాదు తాను బాడ్మింటన్ ప్లేయర్ కూడా అని చెప్పి షాక్ ఇచ్చాడు. అది కూడా జాతీయ స్థాయి క్రీడాకారుడట.అలా బాడ్మింటన్ ప్లేయర్ గా కనిపించాల్సిన నేను నటుడుగా మారానని ఇది ఊహించలేదని చెప్పారు. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు తారక్.
కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా చేయబోతున్న తారక్ ఈ సినిమాకోసం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లైన్లో ఉన్నారు. ఎలా వరుస సినిమాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా అయిపోనున్నారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ బాటలోనే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోబోతున్నట్లు సమాచారం.