త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయో ఎన్టీఆర్ 30 సినిమా ” కథ ” అద్భుతం అబ్బా ..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న ఫిక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డీవీవీలో దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్ లాంటి భారీ తారాగణం ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

Fans love the first look of Jr NTR's character in RRR, trend it big time on  Twitter

ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన రామరాజు ఫర్ భీం టీజర్ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో చూపించింది. కాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని 2021 సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేయనున్నాడు. 2021 మార్చ్ నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ సినిమాని హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సోదరుడు.. మరో నందమూరి హీరో.. నిర్మాత కళ్యాణ్ రాం కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు.

NTR 30 : NTR Trivikram Movie To Hit The Screens On Summer 2021 - video  dailymotion

కాగా ఇప్పుడు ఎన్.టి.ఆర్ 30వ సినిమా కథ ఇదే అంటూ కొన్ని సోషల్ మీడియా వర్గాలలో హాట్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ని రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాడని సమాచారం. వాటిలో ఒక పాత్ర అమెరికాలో ఉండే కమర్షియల్ బిజినెస్ మెన్ అయితే మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర అని అంటున్నారు. బిజినెస్ మెన్ పాత్ర ఇండియాకి వచ్చి పాలిటిక్స్ లో చేరుతుందని.. ఇదే కథా నేపథ్యం అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇదే గనక తారక్ కోసం త్రివిక్రం రాసిన కథ అయితే పక్కా రికార్డుల మోతే అని అభిమానులు సంబరపడుతున్నారట.