ఎన్టీఆర్ 30… ఆ విషయం చెప్పేస్తారట!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద ప్రేక్షకులందరికీ ఆసక్తి పెంచింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే రామ్ చరణ్ తేజ్ ఆచార్య సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకోగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తరువాతి సినిమా షూటింగ్ కూడా ఇప్పటికీ మొదలుపెట్టలేదు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 30వ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశారు. సినిమా పేరు ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. కానీ దానికి ఎన్టీఆర్ 30 అని పేరు పెట్టి పిలుస్తున్నారు

ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదు. సినిమాలో హీరోయిన్ ఈమె అంటూ పలు రకాల పేర్లు వచ్చాయి. కానీ ఏ విషయం మీద క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడుగుతుంటే ఆమధ్య అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ గట్టిగానే క్లాసు పీకాడు. ఈ దెబ్బకి ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ ఇప్పట్లో అప్డేట్ ఇవ్వమని అడిగే పరిస్థితులు లేవు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇవ్వడానికైతే రంగం సిద్ధమైంది. అదేమిటంటే ఎన్టీఆర్ కట్టి సినిమాకి సంబంధించి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంపికైందని ఆమె పుట్టినరోజు మార్చ్ ఆరో తేదీన జరగబోతూ ఉండడంతో ఈ సినిమా నుంచి ఆమె హీరోయిన్ గా ఎంపిక అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని సుధాకర్ మిక్కిలినేని కొసరాజు హరికృష్ణ నిర్మించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం మీద త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యనే సినిమా ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. కానీ తారక రత్న మరణంతో వాయిదా పడింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5 2024న రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించారు.