దేవరా… భయపెడుతున్న తారక్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ని కొరటాల శివ గ్రాండ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకొని మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడుగా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ కథాంశంతో ఈ మూవీ రెడీ అవుతోంది ఐల్యాండ్ నేపథ్యంలో కంప్లీట్ ఫిక్షనల్ స్టొరీగా ఈ మూవీ ఉండబోతోంది అని తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ఎన్టీఅర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి కీలక అప్డేట్ వస్తుందని ప్రచారం జరిగింది.

ఇక చిత్ర యూనిట్ కూడా బర్త్ డే సర్ప్రైజ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేస్తామని చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ పోస్టర్ లాంచ్ చేశారు. దాంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేశారు. అందరూ ఊహించినట్లే దేవరా అనే టైటిల్ ని ఈ మూవీకి కన్ఫర్మ్ చేశారు. ఇక పోస్టర్ లో కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో పంచెకట్టులో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు.

చేతిలో రక్తంతో తడిచిన కత్తిపట్టుకొని సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటే తీరంలో ఉన్న రాళ్లపై గెడ్డం లుక్ లో సీరియస్ నోట్ లో చూస్తూ ఉన్నారు. ఈ లుక్ లో బలమైన నాయకుడి తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తూ ఉండటం విశేషం. అలాగే కొరటాల శివ చెప్పినట్లుగానే భయమంటే తెలియని రాక్షసులని భయపెట్టే వ్యక్తిగా తారక్ లుక్ ఉంది.

అలాగే బ్లాక్ డ్రెస్ లో గెడ్డంతో తారక్ లుక్ ని ఎలివేట్ చేయడం ద్వారా గ్రే షేడ్స్ లోనే ఆయన పాత్ర ఉండబోతోంది అనే విషయం అర్ధం అవుతోంది. మొత్తానికి ఈ లుక్ అయితే టాలీవుడ్ లో కొద్ది రోజుల పాటు సెన్సేషన్ అయ్యే అవకాశం ఉందనే చెప్పాలి. ఇక దేవరా టైటిల్ కూడా తారక్ లుక్ ని ఎలివేట్ చేసే విధంగా పవర్ ఫుల్ గానే ఉండటం విశేషం.