NTR 30: నిజంగా అంత భయంకరంగా ఉంటుందా?

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఎన్టీఆర్30. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు. అందుకే మూవీ పోస్టర్ ఎలా ఉంటుంది..? మూవీ టైటిల్ ఎలా ఉంటుంది? అనే ఉత్సాహం అభిమానుల్లో పెరిగిపోయింది. అభిమానుల ఉత్సాహాన్ని గుర్తించిన చిత్ర బృందం కూడా మూవీ పోస్టర్ కి ముహూర్తం ఖరారు చేసింది.

మే20వ తేదీ ఎన్టీఆర్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు డైరెక్టర్ కొరాటల శివ ట్రీట్ రెడీ చేశారు. ఒక రోజు ముందుగానే ఈ ట్రీట్ ని అందిస్తున్నారు. మే19వ తేదీ రాత్రి 7:02 గంటలకు ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని చెప్పడానికి మరో ఆసక్తికర పోస్టర్ ని విడుదల చేయడం విశేషం.

ఆ పోస్టర్ చూస్తుంటే మూవీపై ఆసక్తి పెరుగుతోంది. పూర్తిగా దెబ్బతిన్న ఓ పడవ, కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాలు, మొత్తం రక్తం మరకలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. అందులో పెద్దగా రక్తంతో నిండిన ఓ కత్తి కూడా ఉంది. హీరో వాడిన కత్తి అయ్యి ఉండొచ్చు. దీనికి క్యాప్షన్ లో అతని కంటే భయమైనది అతని కథ అని పెట్టడం విశేషం. అంత భయంకరమైన అతని కథ ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తున్నారు అనే ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా నిన్న విడుదలైన పోస్టర్ లో ‘సముద్రం నిండా అతని కథలు రక్తంతో రాసి ఉన్నాయి’ అని రాసి ఉంది.

ఇప్పటివరకు కత్తులతో చంపడాలు, నరకడాలు లాంటి సినిమాలు ఎన్టీఆర్ చాలానే చేశారు. కానీ వాటిని మించి ఈ సినిమా ఉంటందని తెలుస్తోంది. ఆయన కెరీర్ లోనే మోస్ట్ వయలెంట్ మూవీ అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. గతంలోవచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ మూవీపై అంతకుమించి అంచనాలు ఉన్నాయి.