ఓటిటి : ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో ఇక విజయ్ “లియో”..!

తమిళ నాట బిగ్గెస్ట్ స్టార్డం ఉన్న హీరోస్ లో దళపతి విజయ్ కూడా ఒకడు. మరి ఒకప్పుడు మన తెలుగు సినిమాలు నాలుగైదు కలిపితే తాను ఒక సినిమా చేసుకునే స్టేజి నుంచి ఇపుడు టాలీవుడ్ స్టార్స్ సినిమాలనే దాటేసే రేంజ్ బాక్సాఫీస్ క్రేజ్ ని విజయ్ సొంతం చేసుకున్నాడు.

అలా తాను లేటెస్ట్ గా చేసిన భారీ చిత్రం “లియో” తో వచ్చి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ని కూడా అందుకున్నాడు. అయితే ఈ సినిమాని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా యావరేజ్ టాక్ తోనే సినిమా ఏకంగా 600 కోట్లకి పైగా వసూళ్ళని అందుకుంది.

ఇక థియేటర్స్ లో రిలీజ్ తర్వాత నెల లోనే సినిమా ఓటిటి రిలీజ్ కి కూడా వచ్చేయగా ఈ రిలీజ్ లో కూడా మూడు వెర్షన్ లలో వచ్చింది. మరి మొదటగా ఇండియాలో రిలీజ్ కాగా తర్వాత ఇతర దేశాల్లో కూడా అయ్యింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరకు పాన్ ఇండియా భాషల్లోనే ఇండియా సహా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ కాగా ఇప్పుడు అయితే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది.

కాగా మిగతా భాషల్లోనే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన నెట్ ఫ్లిక్స్ లోనే ఇంగ్లీష్ లో కూడా సినిమా వచ్చేసింది. దీనితో ఈ న్యూస్ ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో త్రిష, గౌతమ్ మీనన్, అర్జున్, సంహాయ్ దత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా అనిరుద్ సంగీతం సమకూర్చాడు.