లేటెస్ట్ : పవన్ పార్టీలో చేరిన సినీ ప్రముఖులు..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు బార్క్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాలు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా కనిపిస్తున్నాడు. దీనితో పవన్ సినిమాలకి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వగా మొత్తం తన పార్టీ పనుల్లోనే బిజీగా ఉన్నారు.

కాగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో తెలిసిందే. సినిమాల్లో కూడా కూడా చాలా మంది ప్రముఖులు పవన్ కి అభిమానులు ఉన్నారు. కానీ పాలిటిక్స్ లో కూడా సపోర్ట్ చేసినవారు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. మరి ఇప్పుడు సినీ ప్రముఖులు నుంచి కూడా పవన్ కి అండగా నిలుస్తున్నారు.

తాజాగా పవన్ జనసేన పార్టీలో నేషనల్ ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పార్టీ కండువా కప్పుకోగా తనతో పాటుగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ కూడా తన కుటుంబ సమేతంగా ఈరోజు పార్టీలో కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు.

కాగా జానీ మాస్టర్ అయితే మొదటి నుంచి కూడా పవన్ కి పెద్ద అభిమాని నేషనల్ అవార్డు ఫంక్షన్స్ లో కూడా జానీ మాస్టర్ పవన్ మ్యానరిజం చేస్తాడు. గత కొన్ని రోజులుగా కూడా తాను జనసేన లో జాయిన్ అవుతాడు అని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ గా జాయిన్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.