ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఏకైక పాన్ ఇండియా స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. తాను అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇంకా సుకుమార్ నుంచి వచ్చిన హ్యాట్రిక్ సినిమా “పుష్ప” గత ఏడాది భారీ రికార్డులు తిరగరాసి ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ రికార్డు నెలకొల్పింది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించగా మొదటి భాగం కన్నా డబుల్ ట్రిపుల్ లెవెల్లో అంచనాలు పెరిగిపోయాయి. దీనితో ఈ సినిమాకి భారీ డిమాండ్ నెలకొనగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి పుష్ప డిజిటల్ రైట్స్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.
ఈ సినిమా ఓటిటి హక్కులు గతంలో అన్ని భాషలలో కలిపి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేయగా ఈసారి మాత్రం ప్రముఖ సంస్థ భారీ ఆఫర్ తో అందరికన్నా ముందు వరుసలో ఉందట. మరి ఆ సంస్థే నెట్ ఫ్లిక్స్ అని తెలుస్తుంది. మేకర్స్ ఎంత అడిగినా నెట్ ఫ్లిక్స్ వారు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు ఇన్సైడ్ రిపోర్ట్స్.
దీనితో ఈ భారీ సినిమాకి మరికొన్ని రోజుల్లో ఓటిటి డీల్ అయితే నెట్ ఫ్లిక్స్ తో ముగిసిపోవడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరింత భారీ తారాగణం పార్ట్ 2 లో యాడ్ అవ్వనుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.