పూజా హెగ్డే, కీర్తి సురేష్ కాదు .. ఇప్పుడు పూరి హీరోయిన్ అంటున్నారు ..?

డైరెక్టర్ పూరి జగన్నధ్ అమ్మాయిని టాలీవుడ్ కి పరిచయం చేశాడంటే హీరోయిన్ గా ఆ అమ్మాయి దశ తిరిగిపోవాల్సిందే. పూరి చూపించే విధానానికి వరసగా అవకాశాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు రొమాంటిక్ అన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న కేతికా శర్మ కి కూడా ఒక భారీ ప్రాజెక్ట్ లో అవకాశం ఇవ్వడానికి మేకర్స్ ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. అది కూడా పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ పరిశీలించిన మేకర్స్ ఇప్పుడు కేతికా శర్మ గురించి ఆలోచించడం షాకింగా ఉంది.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos  & Videos | Moviekoop

పూరి కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రొమాంటిక్. ఈ సినిమా హీరోయిన్ గా కేతికా శర్మ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ పోస్టర్స్ తో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పోస్టర్స్ లో హాట్ హాట్ గా కనిపించిన కేతికా శర్మ మీద టాలీవుడ్ మేకర్స్ అండ్ యంగ్ హీరోల దృష్ఠి పడింది. అందుకే కొన్ని సినిమాలలో ఇప్పటికే కేతికా శర్మ పేరు ని పరిశీలిస్తున్నారట. కాగా మొదటి సినిమా రిలీజవకుండానే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం.

Keerthi Suresh Photos - Photogallery - Page 1

ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమా కాగా హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా పూజా హెగ్డే నటించబోతుందన్న మాట ప్రముఖంగా వినిపించింది. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో 3 భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. దాంతో కీర్తి సురేష్ ని తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.

Mahesh Babu's upcoming film Sarkaru Vaari Paata will feature Keerthy Suresh  as the female lead? | PINKVILLA

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ లో కేతికా శర్మ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో అన్నది అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తే గాని తెలీదు. ఇక కేతికా శర్మ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో పాటు ఆహా ఓటీటీ కోసం అల్లు అర్జున్ తో కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో కూడా నటించింది. ఆహా యాడ్ కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో కేతికా ను పరిశీలించిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కోసం ఫైనల్ చేయాలని భావిస్తున్నారట.