మెగా ఫ్యామిలీలోకి ఒకరు కాదు ఇద్దరు వారసులు రాబోతున్నారా.. బయటపడిన అసలు విషయం?

కొద్ది నెలలలో మెగా కుటుంబానికి బుల్లి వారసుడు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. గత పది సంవత్సరాలు క్రితం రామ్ చరణ్ ఉపాసన దంపతుల వివాహం చేసుకోగా పది సంవత్సరాల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇలా మెగా వారసుడు రాబోతున్నారని తెలియడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఉపాసన తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుంచి ఈమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే తాజాగా ఉపాసన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసన ప్రెగ్నెన్సీకి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్స్ బయట పడ్డాయని ఇందులో ఆమె ఒక బిడ్డకు కాకుండా ఇద్దరికి జన్మనివ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.ఇలా ఒకేసారి మెగా కుటుంబానికి ఇద్దరు వారసులు రాబోతున్నారని తెలియడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అయితే ఇలా ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

ఇక ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నటువంటి ఈ వార్త కనుక నిజమైతే ఇంతకన్నా శుభవార్త మెగా అభిమానులకు ఏది ఉండదని చెప్పాలి. ఏది ఏమైనా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియడంతో బుల్లి రామ్ చరణ్ కోసం మెగా అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఉపాసన నిత్యం తన ప్రెగ్నెన్సీ గురించి ఏదో ఒక వార్త అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. అయితే గత కొద్దిరోజుల క్రితం ఈమె బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.