బిగ్ బాస్ షో లో టైటిల్ విన్నర్ కాగల సత్తా ఉన్న వారిలో నోయెల్ ఒకరు, అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా నోయెల్ బిగ్ బాస్ నుండి బయటకి వచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌కు నిన్న అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టలేదు. దీంతో ఒంటరిగా పాటలు పాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. .. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌ను వైద్యులు పరీక్షించారు. ఇక నోయల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. స్పెషలిస్టుల సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. అయితే త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలన్నాడు. అతడు మెడికల్ రూమ్‌కు వెళ్లడం చూసిన హారిక.. నోయల్ వెళ్లిపోవడం నాకిష్టం లేదంటూ గుక్కపెట్టి ఏడ్వడంతో ఆమెను అభిజిత్ హత్తుకుని ఓదార్చాడు.
గంగవ్వ లాగే బిగ్‌బాస్ షో నుంచి అనూహ్యంగా వెళ్లిపోయాడు. దీంతో ఇంటిసభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. కానీ వీలైనంత త్వరగా కోలుకుని నోయల్ మళ్లీ తిరిగి రానున్నాడు. మళ్లీ వచ్చేస్తాడన్న సంతోషం కన్నా ఇప్పుడు వెళ్లిపోతున్నాడన్న బాధే హారికను ఎక్కువగా కుంగదీసింది. దీంతో అభిజిత్ ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఊరడించాడు.నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని, హారిక నోయల్ వెళ్లిపోయిన చాలాసేపటివరకు ఏడుస్తూనే ఉంది. ఇక ఊహించినట్లుగానే “అరియానా” ఎనిమిదో కెప్టెన్‌గా అవతరించింది.ఇంకా ఎన్ని వింత ఆటలు , ఫన్, మరియు గొడవలు ఉంటాయో? చూద్దాం .