Bigg boss 4 Telugu : ఎట్టకేలకు అసలు స్వరూపం బయటపెట్టిన నోయల్? హౌస్ లో ఒకలా? బయట ఇంకోలా?

noel sean actual behavior revealed in bigg boss 4

నోయల్ సేన్.. ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు. తనను తానే ఎలిమినేట్ చేసుకున్నాడు. ఎందుకు.. తన కాలికి అయిన గాయం వల్ల. నిజానికి నోయల్ సేన్.. స్ట్రాంగ్ కంటెస్టెంటే. కానీ.. అది ఒకప్పుడు. ఆయన హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఓ రెండు వారాల వరకే నోయల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆ తర్వాత నోయల్ పూర్తిగా మారిపోయాడు. పూర్తిగా మారాడా? నటించాడా? అనేది పక్కన బెడదాం. కానీ.. నోయల్ పోతూ పోతూ కంటెస్టెంట్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.

noel sean actual behavior revealed in bigg boss 4
noel sean actual behavior revealed in bigg boss 4

నిజానికి నోయల్ తిరిగి బిగ్ బాస్ హౌస్ కు వస్తాడని అంతా అనుకున్నారు. కొన్ని రోజులు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడులే అని అనుకున్న వాళ్లందరికీ షాక్ తగిలింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఈ పరిస్థితుల్లో హౌస్ లో కంటిన్యూ కావడం కష్టమని.. అందుకే.. ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ తీసుకోవడం కోసం నోయల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని నాగార్జున కూడా హౌస్ మెట్స్ కు చెప్పడంతో హౌస్ మెట్స్ కాసేపు భావోద్వేగానికి గురయ్యారు.

సరే.. అదంతా పక్కన పెడితే.. అసలు విషయం మాట్లాడుకోవాలి మనం. అదే నోయల్ స్వభావం. ఎందుకంటే.. నోయల్ చాలా ముక్కు సూటి మనిషి. డైరెక్ట్ గా ఏదైనా మాట్లాడేస్తాడు. డేరింగ్ పర్సనాలిటీ కూడా. అటువంటి వ్యక్తి ఎందుకు హౌస్ లోకి వెళ్లాక సైలెంట్ అయ్యాడు. మీరు ఒక విషయం గమనించారో లేదో? నోయల్.. హౌస్ లోకి వెళ్లిన రెండు మూడు వారాల వరకు చాలా హుషారుగా ఉన్నాడు. టాస్కులు బాగా ఆడాడు. మిగితా కంటెస్టెంట్లను రఫ్ఫాడించాడు. అయితే.. వీకెండ్ షోలలో నాగార్జున కొన్నిసార్లు నోయల్ కు జలక్ ఇవ్వడంతో.. నీ ఆట నువ్వు ఆడు నోయల్.. అంటూ క్లాస్ పీకడంతో నోయల్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది.

అయితే.. అది అలాగే కంటిన్యూ అయింది. నోయల్ హౌస్ లో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. నోయల్.. హౌస్ నుంచి బయటికి వెళ్లాక స్టేజీ మీద హౌస్ మెట్స్ తో ఎలాగైతే ఉన్నాడో.. అదే ఆయన అసలు స్వరూపం. నోయల్ తనలా ఉండి ఉంటే.. ఆయన మీద ప్రేక్షకులకు, హౌస్ మెట్స్ కు వేరే అభిప్రాయం ఉండేది. కానీ.. నోయల్.. సేఫ్ జోన్ లో ఉండటం కోసం హౌస్ లో సైలెంట్ అయ్యాడు. ఎవ్వరినీ ఏమీ అనలేకపోయాడు. తనను నామినేట్ చేసినా.. వాళ్లకు హగ్ ఇచ్చాడు. దీంతో అందరూ నోయల్.. బెస్ట్ పర్సన్.. ఎవ్వరినీ ఏమీ అనడు.. అనేలా చేసుకున్నాడు.

కానీ.. దాన్ని అలాగే హౌస్ బయట కూడా మెయిన్ టెన్ చేయలేకపోయాడు. ఇక ఎలాగూ వెళ్లిపోతున్నాం కదా.. ఇక హౌస్ మెట్స్ తో పనేంటి.. అన్న చందంగా.. నోయల్, తన ఫేవరేట్ కంటెస్టెంట్ల గురించి.. తనను ఇమిటేట్ చేసిన వాళ్ల గురించి అందరి గురించి నోరు విప్పాడు.

ఈ బిహేవియర్ ను నోయల్ హౌస్ లో ఎందుకు మెయిన్ టెన్ చేయలేకపోయాడు? అనేదే ప్రస్తుతం బిగ్ బాస్ ప్రేక్షకులను తొలుస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా.. అవినాశ్, రాజశేఖర్ మాస్టారు మీద నోయల్ అటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తనకు నచ్చకపోతే అప్పుడే వాళ్లను పిలిచి.. చెప్పి ఉండాల్సింది కదా. ఎలిమినేట్ అయ్యాక చెప్పాడు.. అంటే.. హౌస్ లో ఉన్నన్నిరోజులు నోయల్ సేఫ్ గేమే ఆడాడు. ఒకవేళ.. తనకు నొప్పి లేకున్నా.. త్వరలోనే నామినేషన్స్ లోకి వచ్చి.. ఎలిమినేట్ అయిపోయేవాడే నోయల్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.