సింగర్ నోయల్, హీరోయిన్ ఏస్తర్ గత నాలుగైదు రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అభిప్రాయ బేధాలతో ఈ మధ్యే విడిపోయారు. ఏడాదికి పైగా దూరంగా ఉంటోన్న ఈ జంట విడాకుల విషయంపై ఈ మధ్యే బహిరంగ ప్రకటన చేసింది. ఏడాదికి పైగా తాము వేరుగానే ఉంటున్నామని, గతేడాది జూన్‌లో మ్యూచువల్ డైవర్స్ కోసం పిటీషన్‌ను దాఖలు చేశామని చెప్పుకొచ్చింది.
సెప్టెంబర్ 1న కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేయడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు నోయల్, ఏస్తర్ . అయితే వీరిద్దరూ విడిపోయినా సరే ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదు. మరీ ముఖ్యంగా నోయల్ మాత్రం ఏస్తర్ గురించి ఎంతో చక్కగా చెప్పాడు. ఆమె జీవితం బాగుండాలని, ఆమె కన్న కలలు నిజం కావాలని కోరుకున్నాడు. ఈ విషయంపై ఎవ్వరూ కూడా కామెంట్స్ చేసి బాధపెట్టొద్దని కోరాడు.
ఏస్తర్ సైతం విడాకుల విషయాన్ని చెబుతూ.. విడాకులు తీసుకోవాలనే నిర్ణయం వెనుక ఉన్నసున్నితమైన అంశాలను దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అంతేకాకుండా నా ఈ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, ఎప్పటిలానే మీరు నా వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయింది. అయితే నోయల్ మాత్రం రోజూ ఏదో ఒకరకమైన పోస్ట్ పెడుతూ ఉండటం గమనార్హం. కోలుకోవాలి.. ముందుకు సాగుతూ ఉండాలి.. చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి.. ఎప్పడూ చీకట్లోనే కూర్చోలేము.. అంటూ నోయల్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.