రాహుల్ కోసం నోయల్.. ఆ రూమర్లకు చెక్!!

Noel at rahul Sipligunj Ooko Kaka Show room

నోయల్ రాహుల్ సిప్లిగంజ్ మధ్య విబేధాలు వచ్చాయని ఆ మధ్య ఎన్నో రూమర్లు వచ్చాయి. ఎంతో మంచి ఫ్రెండ్స్, అన్నాదమ్ముల్లా ఉండే ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వైరల్ అయ్యాయి. అది కూడా బిగ్ బాస్ షో వల్ల అని కామెంట్లు వినిపించాయి. బిగ్ బాస్ ఇంట్లో నోయల్ ఉన్నంత కాలం కూడా రాహుల్ మద్దతు తెలిపాడు. అనారోగ్యం కారణంగా నోయల్ బయటకు రావడంతో కొద్ది రోజులు అభిజిత్‌కు రాహుల్ మద్దతు తెలిపాడు.

Noel at rahul Sipligunj Ooko Kaka Show room
Noel at rahul Sipligunj Ooko Kaka Show room

అయితే కొన్ని రోజుల తరువాత రాహుల్ తన సపోర్ట్‌ను అరియానా, సోహెల్‌లకు ఇవ్వడం ప్రారంభించాడు. కానీ నోయల్ మాత్రం అభిజిత్ హారికలకే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అలా రాహుల్ నోయల్ మధ్య దూరం పెరిగింది. అంతే కాకుండా రాహుల్ కొన్ని అనవసరపు మాటలు కూడా మాట్లాడాడు. పనికి మాలినోళ్లను తోసేయండి అంటూ కామెంట్లు చేసేశాడు. అంతే కాకుండా రాహల్ తన సోషల్ మీడియాలో నోయల్‌ను అన్ ఫాలో అయ్యాడు.. నోయల్ బర్త్ డేకు కనీసం విషెస్ కూడా చెప్పలేదంటూ కామెంట్లు వచ్చాయి.

అలా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకున్నారు.కానీ తాజాగా రాహుల్ ఊకో కాక బట్టల షాప్ ప్రారంభోత్సవం రోజున నోయల్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. అంతే కాకుండా మొదటగా బోణీ కూడా చేశాడు. దీనిపై రాహుల్ స్పందింస్తూ… బోణీ చేసినందుకు థ్యాంక్స్ అన్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నోయల్ సైతం ఆల్ ది బెస్ట్ చిచ్చా అంటూ పోస్ట్ చేశాడు. మొత్తానికి ఇద్దరి మధ్య దూరం తగ్గిందని, ఎలాంటి గొడవలు లేవని ఇలా క్లారిటీ ఇచ్చారు.