తెలుగు హీరోయిన్స్ అంటే మన వాళ్ళకి కొన్ని లెక్కలుంటాయి. కొన్ని క్యారెక్టర్స్ కే పరిమితం చేసేస్తారు మన దర్శక నిర్మాతలు. ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా తెలుగుమ్మాయిని తీసుకోవాలంటే కూడా చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఈ విషయంలో మన తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీ మీద తెగ వాపోతుంటారు.. వాపోతున్నారు. ముంబై మోడల్స్ ని తీసుకు వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ హోదా ఇస్తున్నారని ఇక్కడ దర్శక, నిర్మాతలకి తెలుగమ్మాయిలంటే చులకన అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్స్ కూడా తెలుగమ్మాయిలకి ఏం తక్కువ.. సినిమాకి కావాల్సిన విధంగా చేస్తున్నాము కదా అని ఎదురు క్వశన్ చేస్తున్నారు.
అయితే గత కొంత కాలంగా మన తెలుగమ్మాయిలు కూడా కథ కి తగ్గట్టుగా అందులో ని పాత్రకి తగ్గట్టుగా బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అందుకు ఉదాహరణ తెలుగమ్మాయి ఈషా రెబ్బా నే చూడవచ్చు. అంతక ముందు ఆ తర్వాత, అమీ తుమీ, అరవింద సమేత లాంటి సినిమాలు చేసి గుర్తింపు పొందింది. కాని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. అందుకే తనలోని మరో కోణాన్ని ఇప్పుడు బయట పెట్టబోతోంది. బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ రీమేక్ లో బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది.
అలాగే ఇప్పుడు మరో తెలుగమ్మాయి బిందు మాధవి క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. శేఖర్ కమ్ముల నిర్మాణంలో వచ్చిన ఆవకాయ్ బిర్యాని సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. అయితే టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపించిన బింధు మాధవి ఇప్పుడు టాలీవుడ్ మీద బాగా ఫోకస్ పెడుతోందట. వీలైతే బోల్డ్ క్యారెక్టర్స్ చేసేందుకు సై అంటుందట. చూడాలి మరి బింధు మాధవికి తెలుగులో అవకాశాలు వస్తాయా లేదా. కాగా ప్రస్తుతం బిందు మాధవి తమిళంలో మూడు సినిమాలు చేస్తుంది.