వైష్ణవ్ తేజ్ ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి డెబ్యూ సినిమా కోసం ఎంతగా శ్రమించాడో సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూస్తేనే అర్థమవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో అయిన కూడా ఉప్పెన వంటి విభిన్నమైన కథ ని ఎంచుకోవడం ఆ సినిమా కోసం కష్టపడటం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో వైష్ణవ్ తేజ్ నిజంగా మెగా హీరో అనిపించాడు. మెగా హీరోలు మెగా ఫ్యాన్స్ కోసమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల కోసం ఎంతగా కష్టపడతారో ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ అంత కష్టపడ్డాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లకు చిన్న మేనల్లుడు. సాయిధరమ్ తేజ్‌కు తమ్ముడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా వారసత్వాన్ని నిలబెడుతూ వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలో అన్ని రకాలుగా మెప్పించాడు. చిన్నతనంలోనే చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో ఓ కీలక పాత్రతో ఆకట్టుకున్న వైష్ణవ్ ఇప్పుడు హీరోగానూ తొలి సినిమాలో సత్తా చాటాడు. అంతేకాదు దాదాపు 20 ఏళ్ళకి పైగా ఉన్న డెబ్యూ హీరో రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు.
మైత్రీ మూవీస్ లాంటి పెద్ద బేనర్ వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సెట్ అవడం వైష్ణవ్ తేజ్ కి పెద్ద ప్లస్ పాయింట్.
ఇక మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ముందు నుంచే వైష్ణవ్‌ను హీరోగా తయారు చేయడంలో, ఉప్పెన కథను మళ్లీ మళ్లీ విని అంతా ఓకే అనుకున్నాకే వైష్ణవ్ తొలి చిత్రానికి పచ్చ జెండా ఊపడంలో మెగాస్టార్ కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన విజయోత్సవ వేడుకలో వెల్లడించడం కూడా విశేషం. వైష్ణవ్ హీరో కావడంలో చిరు, పవన్ అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదని చరణ్ చెప్పాడు. మెగాస్టార్ ఈ కథ విని దర్శకుడికి కొన్ని కీలకమైన సలహాలిచ్చారని తెలిపాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్, మెగాస్టార్ .. వైష్ణవ్ తేజ్ కి బ్యాక్ బోన్ గా ఉండి వైష్ణవ్ తేజ్ ని హీరోగా నిలబెట్టారు.