ఇంట్రెస్టింగ్ – ఐటెం సాంగ్ లేకుండానే మెగాస్టార్ సినిమా?

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి భారీ పోటీ నడుమ వార్ వన్ సైడ్ చేసేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి భారీ అంచనాలు నడుమ వచ్చిన “వాల్తేరు వీరయ్య”. మైత్రి మూవీ మేకర్స్ కెరీర్ లోనే భారీ లాభాలు అందించిన సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా సక్సెస్ తర్వాత అయితే అంతా ఇపుడు “భోళా శంకర్” వైపు చూస్తున్నారు.

అవ్వడానికి ఇది రీమేక్ అయినప్పటికీ వీరయ్య మాస్ మేనియా లో దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ మాస్ కమర్షియల్ జానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ కోవలో మెగాస్టార్ నుంచి వచ్చిన దాదాపు అన్ని చిత్రాల్లో కూడా ఐటెం సాంగ్ లేకుండా అయితే లేదు.

మరి ఇప్పుడు అయితే ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే భోళా శంకర్ లో అసలు ఎలాంటి ఐటెం సాంగ్ ని మేకర్స్ పెట్టడం లేదట. ఐటెం సాంగ్ గాని ఏ స్పెషల్ సాంగ్ కానీ ఈ సినిమాలో లేవని సినీ వర్గాల్లో తెలుస్తుంది. నార్మల్ గా చిరు మార్క్ డాన్స్ ఉండే సెలెబ్రేషన్ సాంగ్ తమన్నా చిరు మధ్య సాంగ్ మినహా ఐటెం సాంగ్ లాంటివి సినిమాలో లేకపోవడం ఆశ్చర్యకరం అని చెప్పాలి.

కాగా ఈ సినిమాకి అయితే మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఆగష్టు 11 న ఈ సినిమా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.