బిగ్ బాస్ షో అంటేనే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. క్షణక్షణం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి బిగ్ బాస్ హౌస్ లో. ప్రతి వారం ఎవరో ఎలిమినేట్ అవుతారనుకుంటాం.. కానీ ఇంకెవరో ఎలిమినేట్ అవుతారు. ఎవరో కెప్టెన్ అవుతారనుకుంటాం. కానీ.. ఇంకెవరో కెప్టెన్ అవుతారు. ఎవరో టాస్కులు బాగా ఆడుతారనుకుంటాం. కానీ.. ఇంకెవరో టాస్కులు బాగా ఆడుతారు. అసలు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులే వెరైటీగా ఉంటాయి. అది ఏ బిగ్ బాస్ హౌస్ అయినా సరే.. హిందీ, తమిళం, తెలుగు.. అనే తేడా లేకుండా.. ఏ బిగ్ బాస్ హౌస్ లో అయినా జరిగేది ఇదే.
ఇటీవలే హిందీలో బిగ్ బాస్ సీజన్ 14 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే కదా. ప్రారంభమై రెండు వారాలు కాలేదు అప్పుడే హిందీ బిగ్ బాస్ మాంచి ఊపుమీద వెళ్తోంది. కంటెస్టెంట్లు కూడా హౌస్ ఫుల్లు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. అయితే.. ఈసారి బిగ్ బాస్ 14లో సరికొత్ ప్రయోగం చేయబోతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
ఈ ప్రయోగంలో భాగంగా… ఈసారి ఎలిమినేషన్స్ లేకుండా చేస్తున్నారు. ఎలిమినేషన్స్ లేకుంటే ఎలా మరి.. వారం వారం ఎలిమినేషన్ లేకపోతే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఏముంటుంది.. చివరకు ఒక్క కంటెస్టెంట్ ఎలా మిగులుతారు.. అంటారా? అక్కడే ఉంది పెద్ద తిరకాసు.
ఎలిమినేషన్ స్థానంలో.. ఇన్విజిబుల్ అనే ప్రక్రియను తీసుకొచ్చారు. ఇన్విజిబుల్ అంటే అదృశ్యం అన్నమాట. నామినేట్ అయిన వాళ్లలో ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చి.. ఎలిమినేట్ అవుతారో వాళ్లను హౌస్ నుంచి పంపించరు. వాళ్లు హౌస్ లోనే ఉంటారు కానీ.. హౌస్ లో ఒక ఇన్విజిబుల్ మెంబర్ లా ఉండాలి అన్నమాట. అంటే.. ఆ వ్యక్తి హౌస్ లో ఉన్నా.. లేనట్టే. మిగితా కంటెస్టెంట్లు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోరు. బిగ్ బాస్ చెప్పినట్టుగా మాత్రమే ఆ వ్యక్తి చేయాల్సి ఉంటుంది. మిగితా కంటెస్టెంట్లతో ఆ వ్యక్తి మాట్లాడడు.. మిగితా కంటెస్టెంట్లు కూడా ఆ వ్యక్తితో మాట్లాడరు. అదే ఈ ఇన్విజిబుల్ ప్రక్రియ అన్నమాట.
ఈ వారం ఎలిమినేషన్ లో ముగ్గురు కంటెస్టెంట్లు కుమార్ సాను, అభినవ్ శుక్లా, డియోల్ ఉండగా… ఈ సారి నో ఎలిమినేషన్స్.. ఓన్లీ ఇన్విజిబుల్ ప్రక్రియ ఉంటుందని.. హోస్ట్ సల్మాన్ ఖానే స్వయంగా ప్రకటించారు.
ఇన్విజిబుల్ గా ఉన్న వ్యక్తి ఒకవేళ బిగ్ బాస్ ఆదేశాలను పాటించకపోయినా… ఇతర కంటెస్టెంట్ల విషయాల్లో జోక్యం చేసుకున్నా.. ఆ వ్యక్తిని వెంటనే బిగ్ బాస్ ఇంటి నుంచి పంపించేస్తాడన్నమాట. ఇదేదో బాగుంది కదా.
ముందు ఈ వారం హిందీ బిగ్ బాస్ లో ఈ ప్రక్రియను ప్రారంభించి.. ఇది సక్సెస్ అయితే.. అన్ని భాషల్లో వచ్చే బిగ్ బాస్ షోలోనూ ఇదే ప్రక్రియను ఉపయోగించాలని బిగ్ బాస్ యాజమాన్యం యోచిస్తోందట. చూద్దాం.. ఈ సరికొత్త ప్రయోగం ఏమేరకు సక్సెస్ అవుతుందో?