‘భోళా శంకర్’ సినిమా రిజల్ట్ విషయంలో దారుణమైన దుష్ర్పచారం జరిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సినిమా కూడా ఆశించిన విధంగా అంచనాల్ని అందుకోలేకపోయింది.
అయినా కానీ, చిరంజీవి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదట. తనపై ఎంత నెగిటివిటీ వచ్చినప్పటికీ, తాను అనుకున్నదే చేయాలనుకుంటున్నారట. ముందుగా అనుకున్నట్లుగానే తదుపరి సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లాలనుకుంటున్నారట చిరంజీవి.
అందుకోసం తెర వెనుక వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. చిన్నపాటి సర్జరీ కారణంగా చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. అయినా కానీ, కథా చర్చలు మాత్రం కొనసాగిస్తూనే వున్నారట చిరంజీవి. ఓ వారం, పది రోజుల్లో ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తాయనీ తెలుస్తోంది.
చిరంజీవి లిస్టులో ప్రస్తుతం ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ వున్నారు. వీరితో పాటూ ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ పట్ల కూడా చిరంజీవి సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిలో ఏ కథని చిరంజీవి ఫైనల్ చేస్తారో చూడాలి మరి.
సంక్రాంతికి అటూ ఇటూగా చిరంజీవి నుంచి ఇంకో సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.