నిత్యా మీనన్ ఆగుట్టును బయటపెట్టేసింది

Nitya Menon opened her secret about acting

నిత్యా మీనన్ తెలుసు కదా. కేరళ కుట్టి.. తన కళ్లతోనే కుర్రకారును మాయ చేస్తుంది. తన అందచందాలతో కుర్రకారు మదిలో చోటు సంపాదించుకున్న ఈ సుందరి ప్రస్తుతం ఓ పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్ లో నటిస్తోంది. దానితో పాటు ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లోనూ చేసింది. అభిషేక్ బచ్చన్ తో హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించింది.

Nitya Menon opened her secret about acting
Nitya Menon opened her secret about acting

ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా తన యాక్టింగ్ సీక్రెట్ ను బయటపెట్టింది. నిజానికి నిత్యా మీనన్ చాలా నాచురల్ గా నటిస్తుంది. అందులోనూ బికినీ షోలు, రొమాన్సులకు నిత్యా దూరం. తన పరిధి మేరకే నటిస్తుంది. కిస్సు సీన్లకు కూడా దూరం. మరీ తప్పదు అనుకుంటేనే కొంచెం రొమాంటిక్ మూడ్ కు వెళ్తుంది కానీ.. చాలా హోమ్లీ గర్ల్ నిత్యా.

తను నటించేటప్పుడు తన మనసులో నుంచి ఓ మెరుపు వస్తుందట. అదే తనకు ఎనర్జీని ఇస్తుందట. ఆ ఎనర్జీతోనే సూపర్ డూపర్ గా నటించేస్తాను అంటున్నది నిత్యా.

నా జీవితంలో సినిమాలు ఒక పార్ట్ మాత్రమే. సినిమాలు కాకుండా నాకు వేరే వ్యాపకాలు చాలా ఉన్నాయి. నాకు ఇష్టమైన పని చేసినప్పుడు నా మనసు సంతోషంతో నిండిపోతుంది. అదే విధంగా నాకు నచ్చిన పాత్రలు చేస్తే కూడా నా మనసు సంతోషంగా ఉంటుంది.

నా కళ్లలోకి ఎప్పుడైనా చూస్తే ఓ మెరుపు కనిపిస్తుంది. అదే నాకు శక్తిని ఇచ్చేది. నాకు నచ్చిన పాత్రలు చేసినప్పుడు కూడా సంతోషంతో నాకు ఎనర్జీ రెట్టింపు అవుతుంది. అలా అవలీలగా నటించేస్తాను.. అంటున్నది నిత్యా.

నిత్యా మీనన్.. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పొజిషన్ ఎంజాయ్ చేసింది. టాలీవుడ్ లో మంచి పాత్రలు చాలా వచ్చినా కూడా నిత్య ఎందుకో రిజెక్ట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహా నటి సినిమా కోసం ముందుగా నిత్యను సంప్రదించాడు డైరెక్టర్. కానీ.. నిత్య ఒప్పుకోకపోవడంతో… నాగ్ అశ్విన్ వెంటనే కీర్తి సురేశ్ ను సంప్రదించడం.. తను ఒప్పుకోవడం.. సినిమా సూపర్ హిట్ కూడా అవడం చకచకా జరిగిపోయాయి.