నాని పాత్రలో నితిన్ సీక్వెల్… దిల్ రాజు కొత్త ప్లాన్

సూపర్ హిట్ సినిమాలని ఏ విధంగా అయితే ఇతర భాషలోకి రీమేక్ చేస్తారో… వాటికి సీక్వెల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అయితే మనం చూస్తున్న దాదాపు అన్ని సినిమాలకు సీక్వెల్ ఉంటుందనే విధంగా సినిమా ముగిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో సీక్వెల్ కి సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ సినిమాలో నటించింది ఒక హీరో అయితే… సీక్వెల్ లో నటించబోయేది మరో హీరో అని అంటున్నారు.

ఆ సినిమా మరేమిటో కాదు. నాని హీరోగా రూపొంది… సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంసీఏ. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ టాక్ దక్కించుకుంది. ఇక ఈ మధ్యకాలంలో హిట్ సినిమాలు చేస్తుంటే… అన్ని దాదాపుగా హిట్స్ అవుతున్న నేపథ్యంలో ఎంసీఏ సినిమాకి కూడా సీక్వెల్ చేయాలని దిల్ రాజు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

అయితే నాని ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారనే పక్షంలో తాను సినిమా చేయలేనని సున్నితంగా చెప్పేశారట. ఇక నాని పాత్రలో నితిన్ ని తీసుకుని సినిమా చేయాలని దిల్ రాజు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నితిన్ కూడా భీష్మ తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తున్న నేపథ్యంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని దిల్ రాజు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతానికి నితిన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఉన్న సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత వెంకీ కుడుములతో సినిమా ఒకటి చేయాల్సి ఉంది. అలాగే మరో సినిమా కూడా ఆయన ఒప్పుకున్నారు. ఈ సినిమాల మధ్యలోనే దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ సీక్వెల్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ మధ్యలో మిగతా సినిమాలతో పాటు ఈ సినిమా కూడా పూర్తి చేస్తారా? లేక ఈ సినిమాలు అన్ని పూర్తి చేస్తారా? అనేది చూడాల్సి ఉంది.