Bheemla Nayak: పవన్ విధ్వంసం సృష్టించారు… ఇది కదా మాకు కావాల్సింది… నితిన్ ట్వీట్ వైరల్!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భీమ్లానాయక్‌ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఫిబ్రవరి 25 తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా పై నితిన్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా నితిన్ పవన్ సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా నితిన్ ట్వీట్ చేస్తూ ఇది కథ మాకు కావాల్సింది… పవన్ కళ్యాణ్ విధ్వంసం సృష్టించారు. రానా ఇరగొట్టావ్‌.. తమన్‌ మ్యూజిక్‌లో ఫైర్‌ ఉంది. త్రివిక్రమ్‌, సాగర్‌ చంద్రకు కృతజ్ఞతలు” అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నితిన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా పై అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, రామ్ గోపాల్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఈ సినిమా పై స్పందిస్తూ ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా నిన్న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా భీమ్లానాయక్‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.