నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రానికి ’తమ్ముడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. అనిల్ రావిపూడి స్విచ్చాన్ చేశారు. వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ‘వేణు శ్రీరామ్ మా సంస్థలో ’ఎంసీఏ’, ’వకీల్ సాబ్’లాంటి సూపర్ హిట్లు అందించాడు. నితిన్‌తో చేసిన ’దిల్’ ఎప్పటికీ మర్చిపోలేం. ఈ కాంబోలో ఓ సినిమా రావడం సంతోషంగా ఉంది. సెప్టెంబరు 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతామని నిర్మాతలు తెలిపారు. ఛాయాగ్రహణం: సేతు.