పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ చిన్న రోల్ కోసం హీరో నితిన్ తెగ ప్రయత్నాలు చేసేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే నితిన్‌కి వీరాభిమానం. ఆ అభిమానంతోనే, తన కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడు. అయితే, ఆ స్పేస్ మాత్రం నితిన్‌కి దొరకడంలేదట.
‘ఓజీ’లోనే కనిపించాలనుకునప్పటికీ అది కుదిరే పని కాదని తేలిపోయిందట. ఇప్పుడేమో, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కోసం నితిన్ ట్రై చేస్తున్నాడంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. ఇప్పుడైతే డ్రమెటిక్‌గా వుంటుంది..’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా నితిన్‌తో చెప్పారన్నది తాజా ఖబర్.
కాగా, పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా నిర్మించేందుకే నితిన్ సన్నాహాలు చేసుకున్నాడు. అనూహ్యంగా అది కాస్తా వాయిదా పడనట్లు తెలుస్తోంది. ఏమో.. గుర్రం ఎగరావచ్చు.! ఏం చెప్పగలం.? ‘ఓజీ’ కోసమే, నితిన్ అవసరం పవన్ కళ్యాణ్‌కి పడొచ్చు కూడా.. అన్నది ఓ వాదన.