మెగా ప్రాజెక్ట్‌లోకి నితిన్.!

మెగాస్టార్ చిరంజీవి – యంగ్ హీరో నితిన్ కలిసి ఓ ప్రాజెక్ట్‌లో కనిపించబోతున్నారా.? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయ్. మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన సినిమాల లిస్టులో ఓ రీమేక్ మూవీ వున్న సంగతి తెలిసిందే. అదే మలయాళ బ్లాక్ బస్టర్ ‘బ్రోడాడీ’. ఈ ప్రాజెక్టులో యూత్ ఫుల్ యంగ్ స్టర్ సిద్దు జొన్నలగడ్డతో కలిసి చిరంజీవి నటించబోతున్నారనీ ఈ మధ్య ప్రచారం జరిగింది.

అయితే, ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా నితిన్ పేరు వినిపిస్తోంది. నితిన్.. పవన్ కళ్యాణ్‌కి అరి వీర భక్తుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్‌కి భక్తుడంటే.. చిరంజీవికీ భక్తుడే.

గతంలో పలుమార్లు అవకాశమొస్తే చిరంజీవిగారితో కలిసి నటించాలని వుందంటూ నితిన్ చెప్పాడు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందేమో అనిపిస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం చిరంజీవి, నితిన్ ప్రాజెక్ట్ సెట్ అయితే, ఆ ప్రాజెక్ట్‌కి మరింత వెయిటేజీ వచ్చినట్లుంటుంది కూడా. ఏమో ఏం జరుగుతుందో లెట్స్ సీ.!