ఇండస్ట్రీలో నితిన్ కి 20 ఏళ్ళు..ఈ జర్నీపై నితిన్ చెప్తున్నది ఏమిటంటే.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర హీరోగా మంచి ఫేమ్ వచ్చి అలాగే అంతే దారుణ అపజయాలు వచ్చి నిలదొక్కుకోవడం అనేది అందరి హీరోల విషయంలో జరగదు. అలాంటి హీరోలలో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకడు. అయితే నితిన్ లాంటి భారీ ప్లాప్ లు మరో హీరోకి గాని వచ్చి ఉంటే ఈ పాటికే వారు సినిమాలు వదిలేసేవారు. అలాంటి వారు కూడా ఇప్పుడు లేకపోలేరు. 

అయినా నితిన్ ఇప్పటికీ 20 ఏళ్ల పాటు నిలదొక్కుకొని నిలిచాడు. తన తండ్రి ఎంత నిర్మాత అయినా తనకంటూ సొంతంగా క్రేజ్ ని నితిన్ సొంతం చేసుకొని ఈరోజుతో టాలీవుడ్ లో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ 20 ఏళ్ళు పూర్తి పై తన వైపు నుంచి ఒక ఎమోషనల్ లెటర్ ని అందరితో పంచుకున్నాడు. 

జయం సినిమాతో సినిమాల్లోకి నేను వచ్చి 20 ఏళ్ళు అయ్యింది, అసలు ఈ మూమెంట్ ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎలా చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు. మొదటిగా నన్ను హీరోగా పరిచయం చేసిన నా ఫస్ట్ దర్శకుడు తేజ గారికి థాంక్స్ చెప్తున్నాను. 

తర్వాత ఇప్పటివరకు నేను పని చేసిన నా దర్శకులు నా సినిమాల కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ బట్ లీస్ట్ ఇన్నేళ్ల పాటు నన్ను అభిమానిస్తూ అండగా నిలిచిన అభిమానులకి అయితే హార్ట్ ఫుల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ యూత్ స్టార్ తన స్పెషల్ డే కి ఈ మెసేజ్ ని పంచుకున్నాడు.