వీడియో టాక్ : క్రేజీ కాన్సెప్ట్ తో “రాబిన్ హుడ్” గా నితిన్.. 

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న టైర్ 2 హీరోస్ లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకడు. కాగా తన లాస్ట్ హిట్ భీష్మ తర్వాత మళ్ళీ తనకి ఆ రేంజ్ హిట్ లేదు. ఇక గత డిసెంబెర్ లో వచ్చిన సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు.

దీనితో డిజాస్టర్స్ తోనే కొనసాగుతున్న నితిన్ మళ్ళీ తన భీష్మ దర్శకుణ్ణే నమ్ముకున్నాడు. కాగా ఈ చిత్రం తోనే హీరోయిన్ రష్మికా మందన్నా కూడా నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు కానీ తర్వాత ఆమె తప్పుకుంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇపుడు అసలు సినిమా టైటిల్ మరియు నితిన్ తాలూకా ఫస్ట్ లుక్ లని పరిచయం చేశారు.

కాగా తెలుగులో ఈ చిత్రం “రాబిన్ హుడ్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకుంది. అయితే నితిన్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన లేటెస్ట్ టైటిల్ గ్లింప్స్ మాత్రం మరింత కేజ్రీగా ఉందని చెప్పాలి. తనని తాను ఓ దొంగగా పరిచయం చేసుకున్నాడు.

ఇండియాలో ఉండే అందరు నా సోదరీ సోదరీమణులు వాళ్ళ జోబులో నేను చేయి పెడితే నన్ను జైల్లో పెట్టారు అయినా కూడా నేను ఆగను అంటూ తాను దొంగతనం చేస్తున్న సొత్తుని దాచిపెట్టడాన్ని చాల ఆసక్తికరంగా చూపించారు. అలాగే నితిన్ లుక్ కూడా ఈ సినిమాలో కొత్తగా ఉండగా జివి ప్రకాష్ సూపర్ స్కోర్ ని ఇందులో అందించాడు. కాగా ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
ROBINHOOD Title Reveal Glimpse | Nithiin | Venky Kudumula | GV Prakash | Mythri Movie Makers