Kajal Aggarwal: రెండవ బిడ్డ ఆన్ ది వే…. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నిషా అగర్వాల్!

Kajal Aggarwal:కాజల్ అగర్వాల్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వరుస సినిమాలతో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ తన చిన్నప్పటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని పూర్తిగా తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ఈమె బేబీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా కాజల్ అగర్వాల్ తన సన్నిహితులు కుటుంబ సభ్యులతో కలసి సీమంతం వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించనుంది.

ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ మరో షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. నిషా అగర్వాల్ కాజల్ అగర్వాల్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఇది నిజం నేను అధికారికంగా వెల్లడిస్తాను త్వరలోనే రెండవ బిడ్డ రాబోతున్నారు. ఇక్కడే ఈ గర్భంలో నేను నా చేతితో తాకుతున్నాను. నేను నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నాను లిటిల్ లవ్
కాజల్ అగర్వాల్ అండ్ గౌతమ్ కిచ్లు మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యంతో, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను! అంటూ నిషా అగర్వాల్ కాజల్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

నిషా అగర్వాల్ కాజల్ అగర్వాల్ కన్నా చిన్నది అయినప్పటికీ ఆమె తన కన్నా ముందుగా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ మరో బిడ్డకు జన్మనివ్వడం తో తను కూడా తన బిడ్డగా భావిస్తూ పరోక్షంగా తెలియజేశారు. త్వరలోనే కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోని ఈమె సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం నిషా అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.