కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో నిఖిల్. ఈ సినిమా అమాంతం నిఖిల్ ఇమేజ్ ని పెంచేసింది. ఇక ఈ మూవీ తర్వాత 18 పేజెస్ సినిమాతో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. అయితే కార్తికేయ 2 రేంజ్ హిట్ అయితే ఈ మూవీతో రాలేదు. ఇక గత ఏడాది కార్తికేయ 2 రిలీజ్ కి ముందే స్పై అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ స్టార్ట్ చేశారు.
ఎడిటర్ గ్యారి ఈ మూవీతో దర్శకుడిగా మారడానికి రెడీ అయ్యాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. ఇక మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే టీజర్ వచ్చి 9 నెలలు అవుతున్న ఇప్పటి వరకు స్పై సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడం విశేషం.
కార్తికేయ 2 తర్వాత స్పై సినిమాతో నిఖిల్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడు అని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ లేదు. అసలు షూటింగ్ కంప్లీట్ అయ్యిందా, ఇంకా ఉందా అనే విషయాలపై కూడా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.
స్పై థ్రిల్లర్ కథలని కరెక్ట్ గా డీల్ చేస్తే ఎక్కడైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ నేపధ్యంలో తనని తాను గ్రాండ్ గా ఎలివేట్ చేసుకోవడం కోసం నిఖిల్ స్పై మూవీని ఒకే చేసాడని టాక్. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే రాబోతుంది.
ఈ నేపధ్యంలో ఏజెంట్ రిలీజ్ తర్వాత ఏమైనా సిమిలారిటీ ఉంటే మార్పులు చేర్పులు చేసుకొని స్టార్ట్ చేద్దామని వదిలేసాడా? లేదంటే పూర్తిగా ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడా అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక కార్తికేయ2, 18 పేజెస్ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా కూడా నిఖిల్ ఎనౌన్స్ చేయలేదు. మరి కొత్త సినిమా అప్డేట్ నిఖిల్ నుంచి ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.