కార్తికేయ 3 గురించి క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. కార్తీకేయ 3 ఉన్నట్టా? లేనట్టా?

చందు మొండేటి దర్శకత్వంలో లిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన రాజా చిత్రం కార్తికేయ 2. గతంలో నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తరికెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ స్థాయిలో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమా యూనిట్ తెగ సంబరపడిపోయారు.

ఇక ఈ సినిమాని చూసిన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా కార్తికేయ, కార్తీకేయ 2 వంటి రెండూ భాగాలు సూపర్ హిట్ అవటంతో ప్రేక్షకులు 3 వ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ విషయం గురించి నిఖిల్ ని ప్రశ్నించగా ..నిఖిల్ స్పందిస్తూ.. ఇప్పటివరకు వచ్చిన కార్తికేయ రెండు భాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందువల్ల కార్తీకేయ 3 కూడా తీయాలని నిర్ణయించుకున్నాం. మీ అందరి దీవెనలతో కార్తికేయ3 కూడా తీయనున్నాం. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది అంటూ వెల్లడించాడు.

అయితే కార్తికేయ త్రీ సినిమా షూటింగ్ ఈ ఎప్పుడు ప్రారంభిస్తామా? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామా?అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక కార్తికేయ 3సినిమాని 3D రూపంలో రూపొందించునున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇక ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాని మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 23 న మలయాళంలో విడుదల కానుంది. అందువల్ల నిఖిల్ ప్రస్తుతం కేరళలో ఈ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు.