కుర్రోడు.. కెలుక్కుంటున్నాడు.!

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ తన తాజా సినిమా ‘స్పై’ ప్రమోషన్లలో బిజీ అవుతున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీతో తెరకెక్కిన ‘స్పై’ సినిమా అట ఇది.! ప్రోమో వచ్చేసింది కదా.. మేటర్ అర్థమయిపోయే వుంటుంది.

నేతాజీ మిస్సింగ్ మిస్టరీని ఓ స్పై ఛేదించడమేంటబ్బా.? అదే మరి పైత్యమంటే.. అన్న విమర్శలొస్తున్నాయ్. బాగా నెగెటివిటీ కనిపిస్తోంది. దీన్ని పొలిటికల్ యాంగిల్‌లో కూడా చాలామంది చూస్తున్నారు. అలాంటిదేమీ లేదంటున్నాడు నిఖిల్.

కాగా, నిఖిల్ మాట తీరు స్పీడుగా వుంటుంది. ఒక్కోసారి పొరపాటు మాటలూ దొర్లేస్తాయ్. ఆల్రెడీ దొర్లేశాయ్ కూడా.! ఈ నేపథ్యంలో నిఖిల్‌కి చిన్నపాటి కోటింగ్ కూడా పడినట్లు (నిర్మాతల వైపు నుంచి) ఓ ప్రచారం జరుగుతోంది.

అవసరమా ఈ కెలుకుడు.? ఇదీ ఇప్పుడు నిఖిల్ సిద్దార్ధ గురించి నడుస్తున్న టాక్‌తో కూడిన సూచన.