పవన్ కళ్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన రచ్చ మామూల్ది కాదు. దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ అయింది. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర భాషల స్టార్స్ కూడా పవన్‌కు విషెస్ తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొమురం పులి హీరోయిన్ అయిన నికీషా పటేల్ చేసిన విషెస్ ఆసక్తికరంగా మారాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌పై ఆ హీరోయిన్ బాగానే అలిగినట్టు కనిపిస్తోంది.
నికీషా పటేల్ పవన్ కళ్యాణ్‌కు గతేడాది కూడా విషెస్ చెప్పింది. అయితే హ్యాష్ ట్యాగ్‌లో మాత్రం ఘోరమైన తప్పిదం చేసింది. పవన్ కళ్యాణ్‌కు బదులు పావలా కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను సెలెక్ట్ చేసుకుని విష్ చేసింది. అలా చేయడంతో అప్పట్లో నికీషాను బాగానే ట్రోల్ చేశారు. దెబ్బకు ట్వీట్ డిలీట్ చేసి మళ్లీ సరైన హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. అయితే ఈ సారి మాత్రం తాను అలాంటి పొరబాటు చేయలేదు అని చెబుతూ పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపింది.
ఈ సారి బర్త్ డే విషెస్ చెప్పిన నికీషా తన మనసులోని మాటను కూడా చెప్పేసింది. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారూ.. మీరెప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి.. మీ నుంచి నాకు ఎప్పుడూ బర్త్ డే విషెస్ రాకపోయినా సరే నేను మాత్రం ప్రతీ ఏడాది మీ బర్త్ డేకు విషెస్ చెప్పడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ ఏడాది సరైన హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించాను’ అంటూ నికీషా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక నికీషాకు చెప్పిన విషెస్‌కు పవన్ స్పందించాడు. బర్త్ డే విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్.. నీకు అంతా మంచి జరగాలి అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.